Monday, 11 May 2020

అమ్మ అని కొత్తగా.. మళ్లీ పిలవాలని-1

2006-07 రోజుల్లో (నాకు సైకిల్ కొనిచ్చిన మరుసటి సంవత్సరం): సైకిల్ వేసుకుని బలాదూర్ తిరగడం ఆరంభించిన రోజులవి. వేసవి సెలవుల్లో మా క్లాస్ మేట్స్ ఇళ్లకి వెత్తుండే వాడ్ని. అమ్మా, నాన్నలకు నేను ఒక్కడ్నే అవ్వడంతో, హాలిడేస్‌లో ఇంట్లో టైమ్ పాస్ అయ్యేది కాదు, అందుకే నేను బయటికి వెళ్తానమ్మా! అంటే, అమ్మ తనకి లోపల భయంగా ఉన్నా కాదనకుండా పంపేది. అలా పొద్దున్న క్రికెట్ రాని ఫ్రెండ్స్ ఇళ్ళు కవర్ చేస్తూ, సాయంత్రాలు క్రికెట్ 🏏 ఒచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తుండే వాడ్ని.‌ ఒక్కోసారి‌ నేను ఇంటికి‌ రావడం లేట్ అయితే‌, నా‌ కోసం‌ ఎదురు చూస్తూ బక్కెట్ వాటర్లో కత్తి వేసుంచేది. అలా వేస్తే నేను తిన్నగా ఇంటికి వస్తానని అమ్మ నమ్మకం ! 



No comments:

Post a Comment

Kasi Annapurna

30-07-2023. Wishing you many happy returns of the day is the common wish that anyone would wish. this birthday of yours is very special to ...