అమ్మ నా కోసం, నేను అమ్మ కోసం భలే సపోర్టీవ్ గా ఉండే వాళ్ళం. చిన్నప్పటి నుండి నేను అమ్మ ఒకే పార్టీ. అమ్మ, వాళ్ళ నాన్నని (మా తాతయ్య చాలా స్ట్రిక్ట్) కూడా నన్ను ఒక్క మాటయినా అననిచ్చేది కాదు. "
ఒక్క! దెబ్బ వేస్తానే వీడి అల్లరి మరీ పెరిగి పోతోంది," అని ఆయనంటే అమ్మ తనకి చాలా ఇష్టమయిన మా తాతయ్య మీద అలిగి, భొజనం మానేసేది. అలానే మా నాన్న అమ్మను కొప్పడితే నాకూ ఆయన మీద కోపం వచ్చేసేది. నేేేను వాళ్ళ మధ్య దూరే వాడిిిిని.
Note:
నేను అందర్లో ఏదయినా పిచ్చి పని చేసేసి తిట్లు తింటుంటే మాత్రం తానే ముందు ఒక్కటేసి ఇంట్లోకి లాక్కెల్లేది. నేను ఏడుస్తూ ఓ మూల కూర్చుంటే, కాసేపయ్యాక సారీ నాన్న! ఇంకెప్పుడు కొట్టను అంటూ నన్ను దగ్గరికి తీసుకొని నా కళ్ళు తుడుస్తూ నుదిటిపై ముద్దు పెట్టి, నా చేతా పెట్టిచ్చుకునేది.
గుడ్ నైట్ అమ్మా !😊
No comments:
Post a Comment